ఏ ఇంటి అమ్మాయివే… లిరిక్స్
చిత్రం: అంతకుముందు ఆ తరువాత (2013)
నటీనటులు: సుమంత్ అశ్విన్, ఈశ రెబ్బా
సంగీతం: కళ్యాణీ మాలిక్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: హేమచంద్ర
దర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటి
నిర్మాణం: కె.ఎల్. దామోధర్ ప్రసాద్
విడుదల తేది: 23.08.2013
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
జాబిల్లి చెల్లాయివే..
అన్నుల మిన్నుల వెన్నెల రాణీ..
ఎన్నడు తోడవుతావే..
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ..
జాబిల్లి చెల్లాయివే..
చిరునవ్వు పూసింది చీకట్లు పోయేలా..
తొలి చూపు తాకింది తొందరయ్యేలా..
ఆ.. చిరునవ్వు పూసింది చీకట్లు పోయేలా..
తొలి చూపు తాకింది తొందరయ్యేలా..
ఆరాట పడిపోతుందీ..
ఆరాట పడిపోతుంది అబ్బాయి జన్మ
పిలిచీనా పలుకవేమే పింగాణి బొమ్మా..
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ..
ఏ ఇంటి అమ్మాయివే..
పాపిట్లొ పారింది మా ఊరి గోదారి
ఆశల్లో ముంచిందిలా నన్ను చేరి
పాపిట్లొ పారింది మా ఊరి గోదారి
ఆశల్లో ముంచిందిలా నన్ను చేరి
ఎరుపెక్కే చెంపల్లోన..
ఎరుపెక్కే చెంపల్లోన తెల్లారు ఝాము
నను తట్టీ లేపిందమ్మా నా మాట నమ్ము
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ..
జాబిల్లి జాబిల్లి చెల్లాయివే..
చామంతి మాలని పోలిన నీ చెయ్యి
చేజిక్కితే ఇక ఢోలు సన్నాయి
హ్మ్.. చామంతి మాలని పోలిన నీ చెయ్యి
చేజిక్కితే ఇక ఢోలు సన్నాయి
వందేళ్ళూ పట్టుకుంట
వందేళ్ళూ పట్టుకుంట వదిలేయకుండా..
గుండెల్లో పెట్టుకుంటా గూడూ కట్టుకుంటా..
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ..
జాబిల్లి చెల్లాయివే..
అన్నుల మిన్నుల వెన్నెల రాణీ..
ఎన్నడు తోడవుతావే..
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ..
జాబిల్లి చెల్లాయివే..
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ..
జాబిల్లి చెల్లాయివే..
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
super