చిత్రం: ఏమిటో ఈ మాయ (2013)
సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్,
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: జి. వి.ప్రకాష్ కుమార్, పూజా
నటీనటులు: శర్వానంద్, నిత్యామీనన్
దర్శకత్వం: చేరన్
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 2013
నువ్వేమి చెప్పినా నా మధి వింటుంది
నేనేమి చెప్పినా నీ మధి వింటుంది
మనమేమి చెప్పినా మౌనం వింటుంది
మౌనాన్ని మించు భాష లేదుగా
మౌనమమే బాషకిలా చిరునవ్వే కవితవునే
నువ్వేమి చెప్పినా నా మధి వింటుంది
నేనేమి చెప్పినా నీ మధి వింటుంది
నువ్వెల్లే దారుల్లో ఒక మొక్కై ఉందీజన్మ
ఎండైన వానైన అది నీకై వేచిందమ్మా
నది అయినా కడలైన అరె నింపేది వానేగా
నీ మేఘం నా మేఘం అని వేరంటే వెర్రెగా
జన్మంతా వేచుంటా నువు జత పడుతుంటే
క్షణముల్లో కనుమూస్తా కలవను పొమ్మంటే
మౌనమమే బాషకిలా చిరునవ్వే కవితవునే
మౌనం ఓ కడలైతే నీ చిరునవ్వేగా కెరటం
ఉప్పెన పొంగిందంటే నువు మాటలు పైకి అనటం
మౌనం ఓ మబ్బైతే నీ శ్వాసైందే ఈ గాలి
గాలులకే మాటోస్తే మన పలుకుల ఈ వర్షాలే
జల్లుల్లో తడవాలా కిటికీ తెరవాలే
వానతో మాటాడాలా గొడుగుని వదలాలే
మౌనమమే బాషకిలా చిరునవ్వే కవితవునే
నువ్వేమి చెప్పినా నా మధి వింటుందే
నేనేమి చెప్పినా నీ మధి వింటుంది
మనమేమి చెప్పినా మౌనం వింటుంది
మౌనాన్ని మించు భాష లేదుగా