ఎంత గుడ్డిదో నా మనసు… లిరిక్స్
సాహిత్యం : సింధూరం రమేష్
గానం : శ్వేత రమేష్
నిర్మాత : బోడా రమేష్
రికార్డింగ్ : లలితా ఆడియోస్
ఎంత గుడ్డిదో నా మనసు,
నిన్ను మరువ లేనంటది.
ఎంత పిచ్చిదో నీకు తెలుసు,
నిన్ను వీడి వుండనంటది.
నా గుండెల్లో నువు దాగి వున్న,
నీకు దూరమై నేనున్నా,
నా కళ్లలో నువు నిండి వున్న,
నీ ఎడబాటులో తడిసున్నా…
ప్రాణమా… ఓ! ప్రాణమా…
ప్రాణమా ఈ జన్మలో
నీ స్నేహం చెరిగి పోదని.
నీ చుట్టూ ఆకాశమల్లే,
నీ వెంటే వస్తున్నానంటూ…
కన్నీరు కబురంపలేదా…
ఒక్కసారైన నిను చేరలేదా…
నే కదులుతున్న రాయి కాదని,
నా చెలిమి గురుతు చేయలేదా…
ప్రాణమా… ఓ! ప్రాణమా… నా ప్రాణమా…
ఆ… నీకుమల్లే స్వేచ్ఛగా,
ఎగిరే రెక్కలు నాకు లేవుగా…
కన్నపేగు బంధాన్ని తెంచి,
చీకటి నింప లేనురా…
భూమి వీడి ఆకాశమల్లే,
దూరంగ నేనుండ లేనుగా…
నీకు దూరమయ్యే రోజే,
నాలో ఊపిరి వుండదురా…
ఎన్ని చీకట్లు సూర్యున్ని ఆపినా…
మళ్లీ సూర్యుడి రాకను ఆపునా…
నిను నా నుండి దూరం చేసినా,
నీతో వందేళ్ల పయనం ఆపునా…
ప్రాణమా…స్నేహ బంధమా…
ప్రాణమా ఈ ప్రేమలో అమృతం అందుతుందంటే,
సాగరాల విషమొచ్చినట్టి,
తనరూపం మార్చేసుకుంది.
మౌనాన్ని తెంచిన బంధమా,
నన్ను చేరలేని నీ దూరమా…
నా గుండెల్లో నిండిన రూపమా….
నేను ఎండమావి కాదు స్నేహమా…
ప్రాణమా… ఓ! ప్రాణమా… నా ప్రాణమా…
నా … కళ్లలోన కన్నీరు
దాచి నవ్వుతు నేనుండ లేనుగా…
గుండెల్లో నీ రూపం దాచి
ఇంకో చేయి అందుకోనురా…
కంటి పాప దాచిన స్వప్నాన్ని
నిజమల్లే మార్చిన ప్రేమనీ…
సాగరాన కూలిన నావల,
ఒంటరిని చేయలేనురా…
నేను నిను వీడి ఎక్కడున్నా…
నీ ఊహల్లోనే బ్రతికున్నా….
నేను చెరిగిపోని స్నేహ గీతమే,
చూపు దారుల్లో నే సాగుతున్నా…
ప్రాణమా… పంచ ప్రాణమా…
ప్రాణమా నీ తోడుగా,
వందేళ్ల బంధముందని.
ఇంద్రధనస్సు రంగులమల్లే,
నీ స్నేహం అందుతుందనీ…
ఆశల్లొ నే బ్రతికున్నా,
అక్షరాల కావ్యమౌతున్నా,
నీ కళ్లా కపటం లేని ప్రేమలో,
నేను ఒంటరై నిలుచున్న.
ప్రాణమా… ఓ! ప్రాణమా… నా ప్రాణమా…
చావు బ్రతుకు రెండింటి
మధ్యన దేవుడు ఆడే ఆటల,
వీడదీశాడు నిను నా నుండి
మనసంటు లేని రాయిలా,
చిటకలోన గెలిచిన ప్రేమకూ…
శక్తులు ఏమి లేవురా…
పోరాడితె ఓటమంటు రాదు
నాకై యుద్ధం చేయరా…
నే మొక్కల్లే రాలుతున్నా…
చితిమంటల్లో కాలిపోతున్నా…
నా ప్రేమలోని నీ పేరుని,
పచ్చ బొట్టల్లే నే రాసుకుంటా…
ప్రాణమా… ఓ! ప్రాణమా…
ప్రాణమా నీ స్నేహమే,
చెరిగిపోని జ్ఞాపకమయ్యి,
ఏడేడు జన్మలో నువ్వే
తియ్యని నేస్తానివై…
గుండెల్లో నువ్వుండి పోవ,
ఒక్కసారైన నన్నల్లుకోవ,
నా చేతిపైన ఆ గీతలా…
నా తోడుగా నువ్వుండి పోవా…
ప్రాణమా… ఓ! ప్రాణమా… నా ప్రాణమా…
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
Excellent
super song. ????????
9000697026