Yevade Subramanyam (2015)

చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం: రధన్ ,  ఇళయరాజా
నటీనటులు: నాని , విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ
మాటలు ( డైలాగ్స్ ):
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మాతలు: ప్రియాంక దత్ , స్వప్న దత్
సినిమాటోగ్రఫీ:
ఎడిటర్:
బ్యానర్: స్వప్న సినిమా
విడుదల తేది: 21.03.2015

చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సెంథిల్ , రిహిత

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా
ఎందుకంట ఇంత దగా నిన్న మొన్న లేదుకాదా లేదుకదా
ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటొ లాగుతుందా
పదనీ తప్పించుకోలేనని తోచెట్టు చేస్తుందా

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా

ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ
ఎవరేమన్నారని పొంగెలే నాలో ఊహలూ
ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ
ఎవరేమన్నారని పొంగెలే నాలో ఊహలూ
తీరం తెలిశాకా ఇంకో దారిని మార్చాలా
దారులు సరి అయినా వేరె తీరం చేరేనా
నడకలు నావేనా నడిచేది నేనేనా

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా

ఇంతగా వద్దంటున్నా ఆగదే ఆత్రం ఏమిటో
ఇంతగా పొంగేటంతా అవసరం ఏమో ఎందుకో
అయినా ఏమైనా ఎద నా చెయి జారేనే
ఇపుడు ఏ నాడు ప్రేమె నేరం కానందీ
చెలిమే ఇంకోలా చిగురిస్తుందంటుంటె

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా

*******   ******   *******

చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్ , రామి

అద్దంలో నిను చూసుకో
నిన్నే నువ్ ప్రశ్నించుకో
నువ్వెవరో తెలుసుకో
who are you
sun of శివ కైలాసం
my name is సుబ్రహ్మణ్యం
బిసినెస్ హా మేరా కాం
all around నాదే దూం దాం
వేగం నా వేదాంతం
గెలవడమే నా సిద్దాంతం
now you know who i am

no no no no no no no నువ్వు నువ్వు కాదు
వెనక్నే ఏ జవాబు రాదు
మనసున లెన్సు పెట్టి జర ఆరా తీసి గుర్తించు నువ్వెవరూ
నొ నొ నొ నొ ఊరు పేరు కాదు
కంపడు ఒడ్డు పొడవు కాదు
మసకల పొరలు తీసి నీ లోనికి తీసి రాబట్టుకో ఆన్సరూ

మల్టి క్రోర్ కంపెనీకి ఒక్క ఓనర్ నీ
నాకీ అర్దం లేని క్వస్చిన్స్ యెందుకనీ
ఆల్వేస్ నేనె నంబర్ వన్ అవ్వాలనీ
డే అండ్ నైట్ పరుగే పరుగు నా పనీ
అయ్యో రామ బ్రేకె లేని నీ జర్నీ
రయ్యంటుందీ హార్టే లేదనీ
ఏదో చోట కట్టెయ్యండె గుర్రాన్ని
నీకే నువ్వు తెలిసేదెప్పుడనీ
నా రూట్ ఏంటొ వేటేంటొ చేరేటి హైటేంటొ
అన్ని తెలిసిన సూపర్ సుబ్బునీ

ఎవ్రీ టైం నన్నే నేరు ఓడిస్తూ ఉంటా
పై పై ఎత్తుల్లోకి ఎదిగిపోతుంటా
రైటొ రాంగొ నాకు అర్దం అక్కర్లేదంటా
కోరుకుంది పొందటం నా బర్తు రైటంటా
ఆకాశంలో జంద పాతె తొందర్లో
పేరు మూలం మిస్స్ అయితే ఎట్టా
నక్షత్రాల్ని బేరం చేసె సందట్లో
గాల్లో మేడలు కట్ట ఓ తంటా
నేణేచోట ఉన్నన్నో ఆ చోటె నాకిష్టం
ఎక్కడినుచి వస్తే ఏంటంటా

నొ నొ నొ నొ నొ నొ నొ నువ్వు నువ్వు కాదు
వెనక్నే ఏ జవాబు రాదు
మనసున లెన్సు పెట్టి జర ఆరా తీసి గుర్తించు నువ్వెవరూ
నొ నొ నొ నొ ఊరు పేరు కాదు
కంపడు ఒడ్డు పొడవు కాదు
మసకల పొరలు తీసి నీ లోనికి తీసి రాబట్టుకో ఆన్సరూ

*******   ******   *******

చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: వశిష్ట
గానం: నిఖిత శర్మ

జంతర్ మంతర్ జాదులన్ని చేసెయ్ నా నీ పైనా
సారో గీరో జీరో గారంటే మార్చేనా
సండే మండే రోజేదైనా తమాషా కరోనా
లైఫ్ ఈస్ ఫుల్ల్ ఆఫ్ వండర్స్ అన్ని ఎంజోయ్ చేయ్ అంటున్నా
చిన్ని లైఫు లోన గోలు మాలు గోల లన్ని ఎందుకో ఎందుకో
చిన్ని చిన్ని ఆశలన్ని చిందులేసి నువ్వు అందుకో అందుకో
పుట్టె ముందు లేవు టెన్షన్సే
లైట్ తీసుకుంటె అన్ని బిందాసే
పల్ పల్కుషీని నువ్ పంచుకుంటె
ఎవ్రిడే కాద కల్లముందు కలర్ఫుల్ డే

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటె ఉందిగా ఈ క్షణం నీది రా
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగెనె జోరుగా ఎంజోయ్ చెయ్ రా

నచ్చినట్టుంటె నువ్వే చుట్టు ఉండే ఈ లోకం
ఒక్కటె నిన్నే మెచ్చుకుంటుందే వెంట వస్తుందే
చెయ్యి అందిస్తే నువ్వే చేరదీస్తుందే స్నేహం
నీకు తోడవుతూ నీడగా ఉంటూ వీడిపోదంతే
ఏక్ దోన్ తీన్ చాల్
పుల్ బుస్ హె యార్
life is too short so think with your heart
పంచేస్తు ప్యార్ సాగోయ్ దిల్ దార్
ఓ చెరిగి పోని ఘాపకానివోయ్ మిగలాలిగా

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటె ఉందిగా ఈ క్షణం నీది రా
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగెనె జోరుగా ఎంజోయ్ చెయ్ రా

*******   ******   *******

చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హరిణి

ఓ కలా ఓ కలా చూడకే అలా
హేయ్ ఇలా నీ వలా అల్లితే ఎలా
మరో ప్రపంచమే అలా వరించగా
పరుగులు తీసే నా ఎదకీ నిలకద నేర్పేదెలా
కుదురుగ ఉంటె మంచిదనీ వెనకకి లాగేదెలా

ఓ కలా ఓ కలా చూడకే అలా

కనులె వెతికే వెలుతురు నీదనీ
ఇపుడే ఇపుడే తెలిసినదీ
తననే పిలిచే పిలుపులు నీవనీ
వయసిపుడే తేల్చుకున్నదీ
నిదురకి చేరితే జోల నువే
మెలుకువ వచ్చినా ఎదుట నువే
ఇక నిను వీడటం ఏలా అదెలా

ఓ కలా ఓ కలా చూడకే అలా

ఎడమ కుడిలో ఎవరూ లేరనీ
ఒనికే పెదవే పలికినదీ
నిజమే పలికే చొరవని ఇచ్చేయ్మనీ
నసిగినదీ నాంచకన్నదీ
మనసుకి చేరువా ప్రతి ఒకరూ
మనకిన దూరమే అని బెదురూ
మరి నిను చేరడం ఎలా అదెలా

ఓ కలా ఓ కలా చూడకే అలా

*******   ******   *******

చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మోహిత్ చౌహన్

ఓ మనిషీ ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం
ఆనందం కన్నీరై జారిన క్షణమిది
నలుపంతా మటుమాయమైనదీ
నీ ప్రాణం ఈ రోజె మరలా ఊపిరి పొంది
తానెవరో కనుగొన్నదీ
ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా

వదలనిదే నీ స్వార్దం కనబడునా పరమార్దం
మనుషులనీ గెలిచేది ప్రేమే కదా
ప్రేమె మానవత్వం ప్రేమే దైవతత్వం
జీవించేటి దారే ఇదీ

ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా

యద సడిలో నిజముందీ కను తడిలో నిజముందీ
అడుగడుగూ గుడి ఉందీ
ప్రతి మనిషిలో నివేదించు ప్రాణం
దైవంతో ప్రయాణం సగేస్తుంది నీ జీవితం

ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమ్రా

ఓ మనిషీ ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం