చిత్రం: యోగి (2007)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తిక్, బెంగుళూరు సునీత
నటీనటులు: ప్రభాస్, నయనతార
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: పి.రవీంద్రనాథ్ రెడ్డి
విడుదల తేది: 12.01.2007
ఏయ్ యోగి ఏయ్ యోగి
ఓరోరి యోగి నన్ కొరికెయ్ రో
ఓరోరి యోగి నన్ నమిలెయ్ రో
ఓరోరి యోగి నన్ కుదిపెయ్ రో
ఓరోరి యోగి నీలో కలిపెయ్ రో
ఓరోరి యోగి నీలో కలిపెయ్ రో
మేరీ దిల్ లే తేరి జాన్ దే
మేరీ దిల్ లే తేరి జాన్ లే ( 3)
ఓరోరి యోగి నన్ కొరికెయ్ రో
ఓరోరి యోగి నన్ నమిలెయ్ రో
ఓరోరి యోగి నన్ కుదిపెయ్ రో
ఓరోరి యోగి నీలో కలిపెయ్ రో
ఓసోసి నారి నిన్ అడిగెయ్ నా
ఓసోసి నారి నిన్ తడిమెయ్ నా
ఓసోసి నారి నిన్ మరిగెయ్ నా
ఓసోసి నారి నీలో మునకెయ్ నా
ఓరోరి యోగి నన్ కొరికెయ్ రో
ఓరోరి యోగి నన్ నమిలెయ్ రో
ఓరోరి యోగి నన్ కుదిపెయ్ రో
ఓరోరి యోగి నీలో కలిపెయ్ రో
చరణం: 1
మేరీ దిల్ లే షేక్ యువర్ బాడీ తేరి జాన్ దే ( 2 )
మేనత్త కొడుకే ఉన్నా… కలకత్తా తిరిగొస్తున్నా నీ సత్తా వాడికి లేదయ్యో
మా ఊల్లో మగవాళ్ళున్నా వాలల్లో వాటం సున్నా నీ వంటివాడే లేడయ్యో
ఇట్టా పొగుడుతూ చెట్టెక్కిస్తున్నావే పిట్టా పదమని పరుపెక్కించేస్తాలే
మెల్లంగా నా పక్కకు వొచ్చి సల్లంగా మక్కువ పెంచి
ఒళ్ళంతా నువ్ హూనం చెయ్యయ్యో యోగయ్యా
పెళ్లే కానీ పెళ్ళం నేను పెళ్ళం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్లెం వెయ్యయ్యో
ఓరోరి యోగి నన్ కొరికెయ్ రో
ఓరోరి యోగి నన్ నమిలెయ్ రో
ఓరోరి యోగి నన్ కుదిపెయ్ రో
ఓరోరి యోగి నీలో కలిపెయ్ రో
షేక్ యువర్ బాడీ
చరణం: 2
ఎల్లుండి వర్జం ఉంది రేపేమో గండం ఉంది ఈ రోజే తాజాగుందయ్యో
ఈ పూటె తిధి బాగుంది… ఈ నిమిషం సుఖపడమంది ఆలస్యం చేస్తావేంటయ్యో
పంచాంగాలనే ఇక పక్కన పెట్టాలే మంచం కోళ్లకే మరి కిక్కుల పుట్టాలే
మెల్లంగా నా పక్కకు వొచ్చి సల్లంగా మక్కువ పెంచి
ఒళ్ళంతా నువ్ హూనం చెయ్యయ్యో యోగయ్యా
పెళ్లే కానీ పెళ్ళం నేను పెళ్ళం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్లెం వెయ్యయ్యో
ఓరోరి యోగి నన్ కొరికెయ్ రో … షేక్ యువర్ బాడీ
ఓరోరి యోగి నన్ నమిలెయ్ రో … షేక్ యువర్ బాడీ
ఓరోరి యోగి నన్ కుదిపెయ్ రో … షేక్ యువర్ బాడీ
ఓరోరి యోగి నీలో కలిపెయ్ రో
********** ********** ************
చిత్రం: యోగి (2007)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: సురేష్
ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది
మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బంధమల్లి (2)
నువ్వే ఇచ్చినా బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశా
తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండే తడిసిపోలేదా జగదీశా
ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష
నీ కన్ను అది చూడదా ఈ కంటి తడి ఆరదా
ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది
మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బంధమల్లి
గుండే గొంతుగా అమ్మా అనే మాటే తనకు చాలయ్యా మహదేవా
తానే నేస్తమై తోడై పెంచిన తల్లికొడుకునోసారి కలిపేవా
చనుబాల తీపి తెలిసుంటే ఈశా కనుగొందువే ఈ పేగు బాష
చెప్పమ్మా నువు పార్వతి అమ్మంటే ఓ హారతీ
ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది
మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బంధమల్లి
********** ********** ************
చిత్రం: యోగి (2007)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్ , గంగ
అబ్బ ఎర్రగా బుర్రగా కుర్రగా వెర్రిగా ఉన్నావు
చిర్రు బుర్రుగా గుర్రమై గుండెలో దూరావు
ముద్దు ముద్దుగా బొద్దుగా పొద్దిగా ఒద్దిగా ఉన్నావు
చిన్ని ముద్దులే రుద్దుతూ నిద్దరే చెరిపావు
నా రౌడీ నువ్వేగా నారాజా నువ్వేగా
నా చిలిపి నువ్వేగా నా ఛీ ఛీ నువ్వేగా
పడి చచ్చాను వచ్చాను తెచ్చాను ఇచ్చాను సోకు …
నన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిచ్చిపోయావు
కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పెంచమాకు
నిన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి పోతాగా
కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి కుదిరేలా
ఆరడుగుల ఎత్తున్నావు అవలీలగా గుర్తొస్తావు …
అమ్మాయిలు ఎవరైనా మరి పడిపోకుండా ఉంటారా
అందరిలో నువ్వే నువ్వు అందంగా నవ్వేస్తావు
అబ్బాయిలు ఎవడైనా మరి చెడిపోకుండా ఉంటారా
అది నీ తప్పు ఇది నా తప్పు
ఇక చెయ్యాలి కలిసి ఒక తప్పు
అరె ఆడోళ్ళు మొదలంటారు
ఆ తప్పేదో ఇకపై నువ్వు చెప్పు
నన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిచ్చిపోయావు
కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పెంచమాకు
నిన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి పోతాగా
కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి కుదిరేలా
నే కాదన్నా చిటికెన వేలు
********** ******** **********
చిత్రం: యోగి (2007)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహదేవన్
శివాయ నమ ఓం.. శివాయ నమ ఓం.. శివాయ నమ ఓం..
డోలు బాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా
ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా
కాళేశ్వరా అరె నీ కాలికందే భాగ్యమేదో నాకివ్వరా
నీ ముందు నేను చిందేసే యోగం రోజు నాకు అందించరా
అహ ముక్కంటి నువే దిక్కంటి..
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రా రా గౌరీ ప్రాణేశ్వరా
ఇక నా గుండె కాదా నీ వెండి కొండ ఉండిపోరా లోకేశ్వరా
డోలేరే… డోలేరే… డోలేరే…
హే.. నీ శిరస్సుపైన ఏమున్నది చందమామ వెలుగున్నది
నీ గొంతుపైన ఏమున్నది నీలి రంగు నీడున్నది
అరె డం డం డం డమరుకములు చెప్పాయి నీలో వెలుగు నీడ కలిసున్నది
హే.. దగ్ దగ్ కుదుపు భయము ఉండొద్దు అంటూ నీలో ఉన్నా సత్యాన్ని కంటున్నా
ముక్కంటి నువే దిక్కంటి..
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రా రా గౌరీ ప్రాణేశ్వరా
ఇక నా గుండె కాదా నీ వెండి కొండ ఉండిపోరా లోకేశ్వరా
హే.. నీ కంటిలోన నిప్పున్నది భగ్గుమంటే బొగ్గయితది
ఆ అగ్గినాపేదేమున్నది గంగ నీకు తోడున్నది
అరె భం భం సదరుగుణము అంటుంది నీలో నీరు నిప్పు కూడున్నది
మరి ఘం ఘం మనిషి మనిషి కలిసుండాలంటూ
నీవు చెప్పే వేదాన్ని వింటున్నా సంభో.. శివశంభో…
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రా రా గౌరీ ప్రాణేశ్వరా
ఇక నా గుండె కాదా నీ వెండి కొండ ఉండిపోరా లోకేశ్వరా
డోలు బాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా
ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా
కాళేశ్వరా అరె నీ కాలికందే భాగ్యమేదో నాకివ్వరా
నీ ముందు నేను చిందేసే యోగం రోజు నాకు అందించరా
అహ ముక్కంటి నువే దిక్కంటి..
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రా రా గౌరీ ప్రాణేశ్వరా
ఇక నా గుండె కాదా నీ వెండి కొండ ఉండిపోరా లోకేశ్వరా
డోలేరే… డోలేరే… డోలేరే…
********** ********** ************
చిత్రం: యోగి (2007)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, సునీత
నీ ఇల్లు బంగారం గాను నా రవ్వల కొండా
నీ వొళ్ళో బందీనవుతాను
నీ వొళ్ళు ఉల్లాసం గాను నా గవ్వల దండా
కౌగిల్లో వందేళ్ళుంటాను
చిలుకను నేను చెరకువి నువ్వు
కొరికిన వేళా కాదనకు
పలకను నేను బలపం నువ్వు
కలిసిన వేళ వలపును రాయకుండ వెళ్ళకు
నీకే అందకపోతే అందం అందం కానే కాదు
నీతో ఆడకపోతే ఆటే కాదంట
నువ్వే ఉండకపోతే లోకం లోకం కానే కాదు
నీలో ఉండకపోతే నేనే కాదంట
దొరలాగా దొరికావు నిను దోచుకోక పోను
కథలాగా కదిలావు నిను చదవకుండ వెళ్ళను
ముక్కుపోగు చెప్పేసింది ముద్దుకు అడ్డం రానని
కాలి మువ్వ చెప్పేసింది సవ్వడి చెయ్యనని
చెంపసిగ్గు చెప్పేసింది గుట్టే దాచేస్తానని
జారు పైట చెప్పేసింది మాటే జారనని
మగవాడై తగిలావు ముడి వేసుకోక పోను
వగలాడై రగిలావు సెగలణచకుండ వుండను