చిత్రం: యుద్దభూమి (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.కృష్ణమోహన్ రావు
విడుదల తేది: 11.11.1988
పల్లవి:
జాలి జాలి సందెగాలి లాలిపాడినా
తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా
ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా..
బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు
సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
ఎందుకో నిలువనీదు నా మనసు బహుశా..
బహుశా.. విరహంలో వుందేమో ఆ సొగసు
చరణం: 1
పడమటింట పొద్దు వాలి గడియ పెట్టినా
తారకళ్ళు ఆకసాన దీపమెట్టినా
వాగులమ్మ అలల నీటి వీణ మీటినా
వెన్నెలమ్మ కనుల మీద వేణువూదినా
ఆగదు అందదు మనసు ఎందుకో
ఒడినే అడిగే ఒంటి మీద వలపు సోకి
కంటి మీద కునుకురాని కొంటె కోరిక తెలుసుకో ఇక
జాలి జాలి సందెగాలి లాలిపాడినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
చరణం: 2
కోకిలమ్మ కొత్త పాట కోసుకొచ్చినా
పూవులమ్మ కొత్త హాయి పూసి వెళ్ళినా
వానమబ్బు మెరుపులెన్ని మోసుకొచ్చినా
మాఘవేళ మత్తు జల్లి మంత్రమేసినా
తీరని తీయని మనసు ఏమిటో
అడుగు చెబుతా ఒంటిగుంటె ఓపలేక
జంట కట్టుకున్న వేళ చిలిపి కోరిక తెలుపుకో ఇక…
సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
ఎందుకో నిలువనీదు నా మనసు బహుశా..
బహుశా.. విరహంలో వుందేమో ఆ సొగసు
జాలి జాలి సందెగాలి లాలిపాడినా
తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా
ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా..
బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు
****** ****** *******
చిత్రం: యుద్ధభూమి (1988)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
అబ్బబ్బా చందమామలాంటి పిల్ల
సందెకాడ తారసిల్లి సన్నజాజులిచ్చి పొమ్మంటే
ఆహాహా…తకఝం..తకఝం..
అమ్మమ్మో చందమామలాంటి వాడు
బుగ్గమీద సిగ్గు గిల్లి సందుజూసి రెచ్చిపోతూంటే
ఆహాహా… తకఝం..తకఝం..
తాకుతుంటే ఒళ్ళూ ఒళ్ళూ తకఝం..తకఝం..
తాకిడాయే ఒంపు సొంపు తకఝం..తకఝం..
బుంగమూతి కజ్జికాయ బుజ్జిపండు గిచ్చుడాయె
అమ్మమ్మో.. అబ్బబ్బా..
కోక చాటు అందాలు కొంగుదాటగా
తకఝం..తకఝం..
వాడి కొంటెచూపు బాణాలు కొంపముంచగా
తకఝం..తకఝం..
అరె ఎప్పుడెప్పుడంటాది నిప్పులంటుకుంటాది
నా ఈడు.. అబ్బ నీతోడూ..
చప్పు చప్పునొస్తాది చప్పరించమంటాది
ఓ ముద్దు అబ్బ ఈ పొద్దు
ఆడబెట్టనా ఈడబెట్టనా యాడబెట్టుకోను
చెప్పు గుండెచప్పుడూ
అమ్మమ్మో చందమామలాంటి వాడు
బుగ్గమీద సిగ్గు గిల్లి సందుజూసి రెచ్చిపోతూంటే
ఏహేహే… తకఝం..తకఝం..
మంచమెక్కమంటాడు మంచి చెప్పినా
తకఝం..తకఝం
సందె చుక్కలేళకంటాది నొక్కి చెప్పినా
తకఝం..తకఝం
అరె గుట్టు గుప్పుమంటాది గూడుదాటి పోతాది
నా గువ్వ అబ్బ అవ్వవ్వ
అరె పక్కపక్కకొస్తాది పండు దాగిపోతాది
నా రెక్క కొత్త నీ రెక్క
ఏమిచెప్పినా ఎంత చెప్పినా
తప్పుచేసి కాని తాను తప్పుకోడమ్మా
అబ్బబ్బా చందమామలాంటి పిల్ల
సందెకాడ తారసిల్లి సన్నజాజులిచ్చి పొమ్మంటే
ఆహాహా…తకఝం..తకఝం..
అమ్మమ్మో చందమామలాంటి వాడు
బుగ్గమీద సిగ్గు గిల్లి సందుజూసి రెచ్చిపోతూంటే
ఓహోహో… తకఝం..తకఝం..
తాకుతుంటే ఒళ్ళూ ఒళ్ళూ తకఝం..తకఝం..
తాకిడాయే ఒంపు సొంపు తకఝం..తకఝం..
బుంగమూతి కజ్జికాయ బుజ్జిపండు గిచ్చుడాయె
అమ్మమ్మో.. అబ్బబ్బా..