చిత్రం: యుగ పురుషుడు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి.సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, జయప్రద, జయలక్ష్మి
దర్శకత్వం: కె.బాపయ్య
నిర్మాత: సి.అశ్వనీదత్
విడుదల తేది: 1978
పల్లవి:
గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా
ఆగనంటుంది.. రేగమంటుంది.. ఆపైన అడగకు ఏం జరిగినా
గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా
ఆగనంటుంది.. రేగమంటుంది.. ఆపైన అడగకు ఏం జరిగినా
అహహ.. గాలి మళ్లింది నీ పైన
చరణం: 1
వయసల్లె వచ్చింది జడి వానా.. తడి ముద్ద చేసింది పైపైన
వయసల్లె వచ్చింది జడి వానా.. తడి ముద్ద చేసింది పైపైన
సెగ ఎగిసి వచ్చింది లోలోనా..
సెగ ఎగిసి వచ్చింది లోలోనా.. మొగ గాలితో దీన్ని చల్లార్చుకోనా
గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా…
చరణం: 2
వానేమి చేస్తుంది వయసుండగా.. వయసేమి చేస్తుంది జత ఉండగా
వానేమి చేస్తుంది వయసుండగా.. వయసేమి చేస్తుంది జత ఉండగా
జతకుదిరి తీరాలి చలి ఉండగా.. చలి మంట ఎందుకు నేనుండగా
అహ… గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా
ఆగనంటుంది.. రేగమంటుంది.. ఆపైన అడగకు ఏం జరిగినా
అహ.. గాలి మళ్లింది నీ పైన
చరణం: 3
పదహారు దాటే ప్రాయానా.. పరవళ్లు తొక్కే చినదానా
పదహారు దాటే ప్రాయానా.. పరవళ్లు తొక్కే చినదానా
వేడెంత ఉన్నదో నీలోనా..
వేడెంత ఉన్నదో నీలోనా… ఈ వేళ తేలాలి నా జతలోనా
గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా
ఆగనంటుంది.. రేగమంటుంది.. ఆపైన అడగకు ఏం జరిగినా…
******** ******** *******
చిత్రం: యుగ పురుషుడు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, సుశీల
పల్లవి :
ఒక్క రాత్రి వచ్చిపోరా..
ఒక్క రాత్రి వచ్చిపోరా… వేయి రాత్రుల వెన్నెలిస్తా
ఒక్క మాట చెప్పి పోరా… ఏడు జన్మలు వేచి వుంటా
ఒక్క రాత్రి వచ్చిపోరా…
ఒక్క రాత్రి వచ్చి పోవే…
ఒక్క రాత్రి వచ్చి పోవే… వేయి పాన్పుల హయి నిస్తా..
ఒక్క మాట ఇచ్చి పోవే.. ఎన్ని జన్మలైనా కలసివుంటా..
ఒక్క రాత్రి వచ్చి పోవే…
చరణం: 1
మెత్త మెత్తగా యెదనే మత్తుగా హత్తుకుపోతా… హాయి అంచు చూస్తా
మెత్త మెత్తగా యెదనే మత్తుగా హత్తుకుపోతా… హాయి అంచు చూస్తా
కన్నెమోజులే నిన్నల్లుకోనీ..
కన్నెమోజులే నిన్నల్లుకోనీ.. కౌగిలింతలే నా ఇల్లు కానీ
ఒక్క రాత్రి వచ్చిపోరా..
చరణం: 2
ఆవిరావిరౌతున్నది నా అందము
ఆవురావురంటున్నది నీ కోసము
ఆవిరావిరౌతున్నది నా అందము
ఆవురావురంటున్నది నీ కోసము
నీ సొగసే ఆవిరైతే నా వయసుకు ఊపిరి
నీ సొగసే ఆవిరైతే నా వయసుకు ఊపిరి
పెదవెంగిలితో తీరును…. ప్రేమ అనే ఆకలి
ఒక్క రాత్రి వచ్చి పోవే…
ఒక్క రాత్రి వచ్చిపోరా … వేయి రాత్రుల వెన్నెలిస్తా
ఒక్క మాట ఇచ్చి పోవే… ఎన్ని జన్మలైనా కలసివుంటా
ఒక్క రాత్రి వచ్చి పోవే..
ఒక్క రాత్రి వచ్చిపోరా …