చిత్రం: యువరాజు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, సుజాత
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున
విడుదల తేది: 24.12.1982
పల్లవి:
నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
అటు చూస్తే గోదారి.. ఇటు చూస్తే కావేరి
నడిమధ్య ఉన్నాను హరి హరి.. హరి
నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
చరణం: 1
హా.. తాగానని తప్ప తాగానని.. చేస్తానని తప్పు చేస్తానని
అనుకోమాకు కలగనమాకు… గోదారి
వేశానని పందెం వేశానని.. పోతానని ఓడిపోతానని
అనుకోమాకు కలగనమాకు… కావేరి
తాగి.. తాగి తాగి.. ఊగి.. ఊగి ఊగి
అడుగు తప్పక.. పదము తప్పక
ఆడిపాడి నిలిచేవాడే.. మగాడు…
నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
అటు చూస్తే గోదారి.. ఇటు చూస్తే కావేరి
నడిమధ్య ఉన్నాను హరి హరి.. హరి
నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
చరణం: 2
ఆగానని.. ఆగి తాగానని
తింటానని.. దెబ్బ తింటానని
అనుకోమాకు కలగనమాకు.. గోదారి..
చూశానని.. అందం చూశానని
పోయానని.. పడిపోయానని..
అనుకోమాకు కలగనమాకు.. కావేరి
ఆడి ఆడిపాడి.. ఆడి పాడి ఆడి
గెలుపు పొందగ.. పిలుపు అందగ
నిన్ను ఓడి గెలిచేవాడే మగాడు…
నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
అటు చూస్తే గోదారి.. ఇటు చూస్తే కావేరి
నడిమధ్య ఉన్నాను హరి హరి.. హరి
నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
******* ******** *********
చిత్రం: యువరాజు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
నీలాల నింగి ఒకసారి వంగి
నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట.. అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా
నీలాల నింగి ఒకసారి వంగి
నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట.. అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా
చరణం: 1
పయనించు మేఘాలు పయనాలు ఆపి
చిరునవ్వు నవ్వి చిరుజల్లు చల్లి
కదలి వెడలిపోతే అదే ముచ్చట
సెలయేటి పరవళ్ళు కాసేపు ఆగి
సెలయేటి పరవళ్ళు కాసేపు ఆగి
సిగ్గుల్లో నిన్ను మైకంలో నన్ను
చూసి చూడలేక.. ఉండీ ఉండలేక
కదలి వెడలిపోతే అదే ముచ్చట.. అదే అచ్చట
అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా
నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట.. అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా
చరణం: 2
నిదురించు అందాలు ఒకసారి లేచి
పైపైకి వచ్చి పరువాలు చూసి
నిదుర మరచిపోతే అదే ముచ్చట
లోలోని కోరికలు లోకాలు మరిచి
లోలోని కోరికలు లోకాలు మరిచి
కళ్ళల్లో నిన్ను.. కౌగిళ్ళో నన్ను
ఉంచీ ఉంచలేక వదలీ వదలలేక
కదలి వెడలిపోతే అదే ముచ్చట అదే అచ్చట
అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా
నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట.. అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా
******** ********* ********
చిత్రం: యువరాజు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
కార్తీక పున్నమి చలిపొద్దులో
కృష్ణా గోదారి నడిబొడ్డులో
ఒక యువరాజు పుట్టాడని
ఒక యువరాజు పుట్టాడని
వాడే వాడే నారాజు అవుతాడని
ఆ ఆ.. ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
వైశాఖ పున్నమి తొలిపొద్దులో
కృష్ణా కావేరి నడిబొడ్డులో
ఒక యువరాణి పుడుతుండని
ఒక యువరాణి పుడుతుండని
ఆమే ఆమే నారాణి అవుతుందని
ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
చరణం: 1
కనులనిండుగుంటాయనీ.. కామాక్షి కాదని.. కంచిలో లేదని
ప్రణయానికి రారాజని.. దేవేంద్రుడు కాడని.. స్వర్గంలో లేడని
కనుముక్కు తీరు చూసేటి జోరు
కనుముక్కు తీరు చూసేటి జోరు
ఎవరికీ ఇంకెవరికీ లేదని.. లేనేలేదని
ఆమే ఆమే నారాణి అవుతుందని
ఆ ఆ.. ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
చరణం: 2
సిరులున్న చిన్నోడనీ.. శ్రీనివాసు కాడని.. తిరుపతిలో లేడని
చిన్నిముక్కు చిలకమ్మనీ.. చిత్రాంగి కాదని.. చిత్రాలు లేవని
చిరునవ్వు నోరు చిందాడే తీరు
చిరునవ్వు నోరు చిందాడే తీరు
ఎవరికీ ఇంకెవరికీ లేదని.. లేనేలేదని
వాడే వాడే నారాజు అవుతాడని
ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
వైశాఖ పున్నమి తొలిపొద్దులో
కృష్ణా గోదారి నడిబొడ్డులో
ఒక యువరాణి పుడుతుండని
ఒక యువరాజు పుట్టాడని
ఆమే ఆమే నారాణి అవుతుందని
ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు