Yuvarathnaa (2021)

Yuvarathnaa (2021)

 

ఆరంభమే.. ఆరంభమే… లిరిక్స్

చిత్రం: యువరత్న (2021)
సంగీతం: త‌మ‌న్ ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రేయ ఘోషల్, ఆర్మాన్ మాలిక్, త‌మ‌న్ ఎస్
నటీనటులు: పునీత్ రాజ్ కుమార్, సయేషా సైగల్
దర్శకత్వం: సంతోష్ ఆనంద్ రామ్
నిర్మాణం: విజ‌య్ కిర‌గందూర్
విడుదల తేది: 2021

Aarambame Aarambame Song Telugu Lyrics

ఇంతే.. ఇది ఇంతే.. మరి
ఇన్నాళ్లు లేనిదీ..లాహిరి
వింతే.. మరి రవ్వంతలో..
కేరింతయ్యింది నా.. ఊపిరి
వేలి చివరి పూల తోట
ఆకశాల వెన్నెల
వానవిల్లు కాలిబాట
నా.. పదాల పరుపులా..
నీలో.. నాలో.. ఒక్కలాగే..
ఈ ప్రేమ మొదలైందిలా..

ఆరంభమే.. ఆరంభమే..
నీ నా కథ ఆరంభమే..
ఆనందమే.. ఆనందమే..
నీతో.. ఇక ఆనందమే..

ఇంతే.. ఇది ఇంతే.. మరి
ఇన్నాళ్లు లేనిదీ..లాహిరి
వింతే.. మరి రవ్వంతలో..
కేరింతయ్యింది నా.. ఊపిరి

నీ ఊసులే.. నా ధ్యాసగా..
ఏ చోట ఉన్నా.. నీతోనే ఉన్నా..
నీ శ్వాసలో.. నులివెచ్చగా..
ఏ వేళనైనా.. నీలో నేనున్నా..
పలవరించు ప్రతి క్షణాన
పెదవంచుల్లోనా.. నీ పేరే అన్నా..
పగలు రేయి కళలలోన
నీ మాటే వింటున్నా.. నీతో కలిసున్నా..
నీ తుఫానే రేగుతోంది
యవ్వనాల సరసునా..
చెంపల్లోనా.. కెంపయ్యింది
నీ.. ప్రతీ.. ఆలోచన

ఆరంభమే.. ఆరంభమే..
నీ నా కథ ఆరంభమే..
ఆనందమే.. ఆనందమే..
నీతో.. ఇక ఆనందమే..

ఇంతే.. ఇది ఇంతే.. మరి
ఇన్నాళ్లు లేనిదీ..లాహిరి
వింతే.. మరి రవ్వంతలో..
కేరింతయ్యింది నా.. ఊపిరి
వేలి చివరి పూల తోట
ఆకశాల వెన్నెల
వానవిల్లు కాలిబాట
నా.. పదాల పరుపులా..
నీలో.. నాలో.. ఒక్కలాగే..
ఈ ప్రేమ మొదలైందిలా..

ఆరంభమే.. ఆరంభమే..
నీ నా కథ ఆరంభమే..
ఆనందమే.. ఆనందమే..
నీతో.. ఇక ఆనందమే..

ఆరంభమే.. ఆరంభమే..
నీ నా కథ ఆరంభమే..
ఆనందమే.. ఆనందమే..
నీతో.. ఇక ఆనందమే..

Yuvarathnaa Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

పవర్ అఫ్ యూత్… లిరిక్స్

చిత్రం: యువరత్న (2021)
సంగీతం: త‌మ‌న్ ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: న‌కాస్ అజీజ్
నటీనటులు: పునీత్ రాజ్ కుమార్, సయేషా సైగల్
దర్శకత్వం: సంతోష్ ఆనంద్ రామ్
నిర్మాణం: విజ‌య్ కిర‌గందూర్
విడుదల తేది: 2021

Power Of Youth Song Telugu Lyrics

యువా యువా యువా యువా …
జాగో జాగోరే యువత… నీలో కల నిజమయ్యేట్టు
పక్కా గురిచూసి కొట్టు…
గో గో గోగోరే చిరుత… నీ బలమెంతో తెలిసేట్టు
ఎక్కు పై మెట్టు మెట్టు

హే తొక్కిపెట్టకు నీలో సరుకు… ఎక్కుపెట్టు తగు లక్ష్యం కొరకు
విశ్రమించకు, నీరసించకు… విజయమందు వరకు
హే ఊపిరాగినా బతికే కిటుకు… నేర్పి చూడు నీ ఆలోచనకి
ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే… గొప్ప దారి వెతుకు

పవర్ అఫ్ యూత్… ||4||
యువా యువా…

ఛాలెంజె ఏదైనా… ఛాలెంజె ఎవరిదైనా
ఎదురించాలి, ఎదురెళ్ళాలి… లేనేలేదనుకో వెనుకడుగు
గెలుపనేదెవ్వడి సొత్తు… జన్మతో అందరి హక్కు
చెమటలు చిందే నీ ప్రతి కష్టం… తిరిగిస్తుంది చల్లని వెలుగు

హే యువత యువత… హే యువత యువత
హే కాళ్ళను లాగే జనాల ముందే… కాలరు ఎగిరేద్దాం
హే యువత యువత… హే యువత యువత
అవమానించిన వాళ్ళ ఫోనుల్లోనే… డీపీ అయిపోదాం
హే గెలుపు రంగుగా… పెదవుల తళుకు
వెలుగు వరకు… నువ్వలుపని అనకు
ఛీ కొట్టినోళ్ల పొగరంత నరకు… చిరునవ్వు కత్తితో

పవర్ అఫ్ యూత్… ||2||
తయ్యారే తకథై… తయ్యారే తకథై తయ్యా
తయ్యారే తకతయ్యా… తక తక తయ్యా ||2||
యువా యువా… యువా యువా

కామెంటు చేసేవాళ్ళు… లోకాన పనిలేనోళ్లే
మన టైమస్సలు ఖాలీ లేదే… వాళ్లకి మనకి పోలిక లేదే
హే యువత యువత… హే యువత యువత
మన ఓటమికెదురు చూసేవాళ్ళని… చూస్తూ ఉంచేద్దాం
హే యువత యువత… హే యువత యువత
పరీక్షలోన ఫెయిల్ అయినా సరే… బతుకును గెలిచేద్దాం

హే ఊపిరాగినా బతికే కిటుకు… నేర్పి చూడు నీ ఆలోచనకి
ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే… గొప్ప దారి వెతుకు
పవర్ అఫ్ యూత్…

Yuvarathnaa Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

error: Content is protected !!