Zombie Reddy (2021)

గో కరోనా గో కరోనా గో.. గో… లిరిక్స్

చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె రాబిన్
సాహిత్యం: మామ సింగ్
గానం: అనుదీప్, శ్రీ కృష్ణ, మామ సింగ్
నటీనటులు: తేజ సజ్జా, ఆనంది, దక్ష నగర్కార్
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాణం: రాజశేఖర్ వర్మ
విడుదల తేది: 05.02.2021

Go Corona Go Corona Go Go Song Telugu Lyrics

ఇంట్లొనే ఉండమంటే ఊరుకుంటామా
రోడ్లన్నీ ఖాళీగా ఉంటే… రాక ఉంటమా
ఎవడెన్ని చెప్తాఉన్నా… మేము ఊరుకుంటామా
మా వీపు పగిలే వరకు మానుకుంటమా
హే వడియాలు ఆరబెట్టి… వాడలంత ఉంటాం
మా బ్రాండు ఉప్పు కోసం… ఊర్లు తిరుగుతుంటాం
మా సింత చెట్టు కింద పేకలాడుకుంటాం
ఇవన్ని చేసి కూడా… పాట పాడుకుంటాం

గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో ||2||

ఏ రోగం అయితే ఎందీ… మనకుంది కదా బ్లీచింగ్ పౌడర్
ఈ వైరస్ పీకేదేంది… మా జేబు నిండ పారాసిటమోల్
మా రాష్ట్ర బడ్జెట్ అంతా… వైన్ షాపులుంది
కాబట్టే మందు కొరకు… రోడ్డు నిండ మంది
ఏది ఏమైనా కాని… మత్తు వదలమంది
లాక్ డౌన్ పెడితే… ఏది ఉచ్చ ఆగదండి

ఆన్ లైన్ లో… పాటాలంటాం
బ్యాక్ గ్రౌండ్ లో… పాటలు వింటాం
సిక్సు ప్యాకు… కలలే కంటు
ఏప్పుడు చూసినా… తింటాం పంటాం
సరికొత్త వంటలు చూస్తాం… మంటెట్టి పెంటే చేస్తాం
ఇన్స్టాంటు నూడుల్ చేసి… ఇన్స్టాలోన బిల్డప్ ఇస్తాం
మ్యాచింగు మాస్కులు వేస్తాం… మరు నిమిషం జేబులో దాస్తాం
దగ్గొచ్చినా తుమ్మే వచ్చినా… పూలతో డాక్టర్ పూజలు చేస్తాం
సరుకులపై సర్ఫ్ ఏసేస్తాం… సానిటైజర్ స్నానం చేస్తాం
సీక్రెటుగా పార్టీ పెట్టి హత్తుకు పోతాం… హత్తుకు పోతాం

ఎత్తుకు పోతాం… ఎత్తుకు పోతాం ||3||

హే చప్పట్లు కొట్టామంటే పీఎం
హే పళ్ళెంతో చావు డబ్బులేద్దాం
హే చీకట్ల పెట్టామంటే దీపం
హే అడ్వాన్స్ దీపావళి చేద్దాం
ఇల్లే హెల్ అయిపాయే… ఐపాయ్
ఒల్లే గుల్లైపాయే… ఐపాయ్
పెళ్ళే లొల్లై పాయే… ఐపాయ్, పిల్లే తల్లై పాయే

గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో ||4||

Zombie Reddy Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Sashi (2021)
Previous
Sashi (2021)